MLG: ములుగు మండలం బండారుపల్లిలోని పీఎం శ్రీ మోడల్ పాఠశాలను శనివారం రాష్ట్ర విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. 617 మంది విద్యార్థులు ఉండటం పాఠశాల నాణ్యతకు నిదర్శనమని, రిజిస్టర్స్, రికార్డ్స్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పనితీరు బాగుందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.