AP: అసెంబ్లీ పనిదినాలు 8 రోజులకు కుదించారు. దీంతో ఈ నెల 27 వరకు సమావేశాలు కొనసాగుతాయి. తొలుత 10 రోజులు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, తాజాగా పనిదినాలను తగ్గించారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుంది. సమావేశాల్లో చర్చించేందుకు టీడీపీ 18, బీజేపీ 9 అంశాలను ప్రతిపాదించాయి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రశ్నోత్తరాలు, శూన్య గంటలో మంత్రులు సభలో ఉండనున్నారు.