GNTR: కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని కోరుతూ, రాష్ట్ర కౌలు రైతు సంఘం ఈ నెల 22వ తేదీన విజయవాడ నుంచి చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా శుక్రవారం ఫిరంగిపురం మండలం, తక్కెళ్ళపాడు గ్రామంలోని కౌలు రైతులతో జిల్లా కౌలు రైతు సంఘం అధ్యక్షుడు బొట్ల రామకృష్ణ సమావేశమయ్యారు. ఈ క్రమంలో ప్రతి కౌలు రైతు జరగబోయే కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.