కృష్ణా: కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి గ్రామం బాలాజీ హైట్స్‌లో రోడ్డు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.