RR: లంబాడీల ఆత్మగౌరవ సభ రేపు (19న) హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా లంబాడీలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని బంజారా విద్యార్థి సంఘం స్టేట్ సెక్రటరీ అశోక్ రాథోడ్ పిలుపునిచ్చారు. లంబాడీలపై జరుగుతున్న కుట్రలను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ఐక్యంగా నిలువాలన్నారు.