VSP: విశాఖలో జరిగిన ‘స్వస్థ్ నారీ-సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు, ప్రతి ఇంటికి మహిళలే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అని పేర్కొన్నారు. చిన్న లేదా పెద్ద కుటుంబాలలో ఇల్లు చక్కదిద్దేది మహిళలేనని, దేశానికి సమర్థ ఆర్థిక మంత్రిగా నిర్మల సీతారామన్ పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళల ఆర్థిక సాధికారతపై ఆయన ప్రసంగించారు.