ములుగు పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి సీతక్క బుధవారం మీడియా సమావేశం నిర్వహించి, మాట్లాడారు. BRS ప్రభుత్వం వస్తే జిల్లా కలెక్టర్ దివాకర్‌ను రాష్ట్రంలో లేకుండా చేస్తా అని BRS నాయకుడు నరసింహమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు. కలెక్టర్ పార్టీ కార్యకర్త అని ఆరోపించడం సరైంది కాదని మండిపడ్డారు. BRS నాయకులు ఆలోచించి మాట్లాడాలన్నారు.