VKB: బషీరాబాద్ జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో ఎసీఎఫ్ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. గురువారం పోటీల్లో పాల్గొనడానికి వచ్చిన సుశాంత్ అనే విద్యార్థి తలపై రావి చెట్టుకొమ్మ విరిగి పడడంతో తీవ్రగాయాలయ్యాయి. మైదానంలో నిల్చున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఉపాధ్యాయులు స్పందించి విద్యార్థిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పాఠశాలలో ఆందోళన నెలకొంది.