స్వచ్ఛ భారత్ మిషన్ రూపొందించిన ‘స్వచ్ఛతా హీ సేవ-2025’ ప్రచార పోస్టర్ను జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్ శుక్రవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛాత్సవ్-పక్షోత్సవాలు కొనసాగుతాయన్నారు. శ్రమదానం చేద్దాం, నిత్యం స్వచ్ఛతని పాటిద్దాం. మన ఇల్లు – మన వాడ – మన ఊరును శుభ్రం చేసుకుందామన్నారు.