SRD: డిఫాల్ట్ మిల్లర్ల ఆస్తులను జప్తు చేయాలని అదనపు కలెక్టర్ మాధురి ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. సీఎంఆర్ అందించడంలో విఫలమైన రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో డిఎస్ఓ బాలసరోజ, సివిల్ సప్లై డిఎం రాజేశ్వర్ పాల్గొన్నారు.