GDWL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గద్వాల ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ అన్ని మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఇళ్ల నిర్మాణ పురోగతి వివరాలను అడిగి తెలుసుకుని, తగిన సూచనలు చేశారు.