BHNG: పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం మరింత తలపించేలా మొక్కలను విరివిగా నాటాలని, చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం పట్టణ కేంద్రంలోని హైలాండ్ పార్కును ఆయన సందర్శించారు. పార్కులో ఉన్న ఓపెన్ జిమ్ పరికరాలను పరిశీలించారు. పిచ్చి మొక్కలను తొలగించి పార్కును పరిశుభ్రంగా ఉంచాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు.