ADB: బోథ్ మండలంలోని సాంగ్వి గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్ గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా బురద మయంగా మారింది. దీంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోయారు. అధికారులు, నాయకులు స్పందించి రోడ్డు మార్గానికి మరమ్మత్తులు చేపట్టాలని కోరుతున్నారు.