BDK: మణుగూరు టౌన్ సీ టైప్ వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న ఓసీ2కు చెందిన డ్రిల్ ఆపరేటర్ కుమార్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని, ఈ ప్రమాదంలో తీవ్రమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడని వెల్లడించారు.