కాంగ్రెస్ అగ్రనాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా సంచలన పోస్టు చేశారు. భారత్లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుందని అన్నారు. ఓట్ చోరీపై యువత, విద్యార్థులు తిరుగుబాటు చేస్తారని తెలిపారు. యువతతో కలిసి రాజ్యాంగాన్ని కాపాడుతానని పేర్కొన్నారు. కాగా, స్టాఫ్ట్వేర్ను హైజాక్ చేసి ఓట్లను తొలగిస్తున్నారంటూ రాహుల్ చేసిన విమర్శలను ఈసీ ఖండించిన విషయం తెలిసిందే.