BDK: కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రామచంద్ర పేట గ్రామంలో సెప్టెంబర్ 28వ తారీఖున చలో భద్రాచలం బహిరంగ సభను విజయవంతం చేయాలని జేఏసీ రాష్ట్ర వైస్ ఛైర్మన్ కల్తీ సత్యనారాయణ ఇవాళ పిలుపునిచ్చారు. ఈ మేరకు రామచంద్ర పేట గ్రామంలో సభా సమావేశం నిర్వహించారు. చలో భద్రాచలం బహిరంగ సభను భారీ సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.