WGL: వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రాంగణంలో గురువారం వర్ధన్నపేట జోనల్ స్థాయి క్రీడాపోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని వర్ధన్నపేట ఏఎంసి ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యత పెరగడంతో పాటు మానసిక వికాసం, వ్యక్తిత్వ వికాసం కలుగుతుందన్నారు.