కృష్ణా: భారతజాతి గర్వించదగిన నేత ప్రధాని నరేంద్ర మోదీ అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. గుడివాడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.