NLR: కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని వైసీపీ మహిళా నేత పూజిత మండిపడ్డారు. మెడికల్ కాలేజీలపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం 10 కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కుట్రలు చేస్తుందని అన్నారు. నిధుల కొరత అంటూ ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా చంద్రబాబు ఆలోచన ఉందని ఆమె విమర్శించారు.