ELR: కౌలు రైతులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరుతూ ఈనెల 22న నిర్వహించే ఛలో అసెంబ్లీ విజయవంతం చేయాలని గురువారం వల్లూరులో రైతు సంఘం నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. భూ యజమానులు ఒప్పుకుంటేనే కార్డులు ఇస్తామని చెప్పటం తగదని అన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని కోరారు.