AKP: పార్లమెంట్ భవనంలో గురువారం జరిగిన స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ సమావేశంలో అనకాపల్లి ఎంపీ, కమిటీ సభ్యులు సీఎం రమేష్ పాల్గొన్నారు. కేంద్ర ఆదాయ పన్ను మండలి, రెవిన్యూ శాఖ ప్రతినిధులు పాల్గొని పన్నుల సంస్కరణలపై చర్చించారు. సరళీకరణ, పారదర్శకత, పన్ను చెల్లింపు దారులకు సౌలభ్యం కల్పించే అంశాలను ఎంపీ ప్రస్తావించారు.