SKLM: పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ.. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు విజ్ఞప్తి చేశారు. మౌలిక వసతులు, బీటీ రోడ్ల కనెక్టివిటీ కొరకు రూ. 10 కోట్లు విడుదల కేటాయించాలని కోరారు. అమృత్ 2.0 నిధుల ద్వారా చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.