మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న మూవీ ‘మన శంకరవరప్రసాద్ గారు’. తాజాగా ‘కిష్కింధపురి’ సక్సెస్ మీట్లో ఈ మూవీపై దర్శకుడు బాబీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూశానని చెప్పారు. చాలా బాగున్నాయని, కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు. నిర్మాత సాహు గారపాటి.. సంక్రాంతికి చిరు మూవీతో మరోసారి మంచి ఫలితాలు చూస్తారని తెలిపారు.