TG: HYDలో ఫోర్త్ సిటీకి 35 వేల ఎకరాలు సేకరించామని, ఫార్మా, ఐటీ, GCCలకు కేంద్రంగా ఫోర్త్ సిటీ అభివృద్ధి చేస్తామని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఫోర్త్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైలు వేయాలని ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలన్నారు. భవిష్యత్లో డీజిల్ బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులు వినియోగిస్తామని తెలిపారు.