RR: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మహిళల ఉపాధి శిక్షణ కోసం ఫెమీనా మహిళ సేవా మండలి అధ్యక్షురాలు సుల్తానాకు ఎమ్మెల్యే తన ఒక నెల వేతనం రూ.2 లక్షలను చెక్కు రూపంలో అందజేశారు. వారు మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా స్వయం ఉపాధి రంగాల్లో నిలదొక్కుకునే విధంగా ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు.