కృష్ణా: ప్రమాద బాధితునికి అండగా ఉంటామని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. చల్లపల్లి నారాయణరావు ఎస్టీ కాలనీకి చెందిన కుంభా రవితేజ అనే 23ఏళ్ల ఆటో డ్రైవర్ ఈ ఏడాది మార్చిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితం అయ్యాడు. అతని వైద్యం కోసం చల్లపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో రూ.20వేలు సహాయాన్ని శుక్రవారం వెంకట్రామ్ చేతులమీదుగా అందచేశారు.