AP: దేశ ఆర్థిక వ్యవస్థకు గేమ్ ఛేంజర్‌గా GST మారిందని CM చంద్రబాబు పేర్కొన్నారు. సంస్కరణల ద్వారానే సంపద సృష్టి సాధ్యమని, అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం సరికాదన్నదే తన విధానమని చెప్పారు. రాష్ట్రానికి నష్టం ఉంటుందని తెలిసినా భవిష్యత్ కోసం మద్దతు ఇస్తున్నామన్నారు. GST 2.0 సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. మొదట్లో CST, VAT వంటి విధానాలు ఉండేవని గుర్తుచేశారు.