VSP: దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి, నాణ్యమైన పంటల ఉత్పత్తిని పెంచడానికి డ్రోన్స్, ఏఐ ఎంతగానో ఉపయోగపడతాయని గీతం డీమ్డ్ యూనివర్సిటీ ప్రొ-వైస్ ఛాన్సలర్ వై. గౌతమ్‌రావు అన్నారు. సోమవారం ఐఐటీ గువాహటితో కలిసి గీతం నిర్వహించిన ఒక జాతీయ స్థాయి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రైతులు ఆర్థికంగా లబ్ధి పొందడానికి ఏఐ సహాయపడుతుందన్నారు.