MNCL: రామకృష్ణాపూర్‌కు చెందిన మహిళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి రూ. 5 లక్షలు పోగొట్టుకుంది. SI రాజశేఖర్ వివరాల ప్రకారం గద్దరాగడిలో నివసించే ఆ మహిళ ఫేస్ బుక్ లో ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఉద్యోగం గురించి చూసి లింకును ఓపెన్ చేసింది. సైబర్ నేరగాళ్లు ఆమెను నమ్మించి, లాభాల ఆశ చూపించి రూ.5 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితురులు ఫిర్యాదు చేసిందన్నారు.