AKP: రాంబిల్లి మండలం పెదకలువలాపల్లి రైతు సేవా కేంద్రంలో గురువారం రైతులకు తహసీల్దార్ శ్రీనివాసరావు, టీడీపీ నాయకుడు దినుబాబు ఎరువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన ఎరువులు మండలంలో గల రైతు సేవా కేంద్రాలు, సొసైటీల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన పని లేదని తెలిపారు.