KRNL: జిల్లాలో ఉల్లికి రూ. 1200 మద్దతు ధర కొనసాగుతుందని ఆర్డీవో సందీప్ కుమార్ తెలిపారు. గురువారం కోడుమూరు మండలం వర్కూరు, వెంకటగిరిలో పంట నష్టం అంచనా, నమోదుపై ఆయన తనిఖీ చేసి, రైతు పొలాల్లో ఉల్లి పంటను పరిశీలించారు. కనీసం 120 రోజులు పూర్తయ్యాక కోత జరపాలని సూచించారు. బోరు నీటితో సాగులో త్వరగా కోస్తే నష్టాలు వస్తాయని రైతులు తెలిపారు.