HYD: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేందుకు ఆలయంలో ఏర్పాటు కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు ఉదయం 3 గంటలకు పెద్దమ్మ తల్లికి అభిషేకం నిర్వహిస్తారు. ప్రతిరోజు రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తి పల్లకి సేవ ఊరేగింపు, పవళింపు సేవ నిర్వహిస్తారు.