KMM: అక్రమ ఇసుక రవాణాలపై ముదిగొండ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం సీజ్ చేశారు. అక్రమ రవాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని ముదిగొండ సీఐ ఓ.మురళి హెచ్చరించారు. అక్రమార్కులకు, అక్రమ రవాణా దారులకు చట్టపరమైన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు.