గ్రామీ అవార్డు విజేత, ‘జీసస్.. టేక్ ద వీల్’ వంటి పాటలను రాసిన గీత రచయిత బ్రెట్ జేమ్స్ విమాన ప్రమాదంలో మృతిచెందారు. జేమ్స్ సహా మరో ఇద్దరితో ప్రయాణిస్తున్న చిన్న విమానం నార్త్ కరోలినాలో కూలిపోయింది. ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయట పడలేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొంది.