KRNL: ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం పత్తి ధరలు పడిపోయాయి. పత్తి గరిష్ఠంగా క్వింటాం రూ. 7,665, కనిష్ఠంగా రూ. 7389 పలికింది. వేరుశనగ గరిష్ఠ ధర రూ. 4,568, కనిష్ఠ ధర రూ. 4,093, ఆముదం గనిష్ఠ ధర రూ. 6,070 పలికినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. రైతులు మాత్రం పత్తి ధర రోజురోజుకూ పతనమవుతుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో రూ. 8-12 వేల వరకు ధర పలికింది.