KMM: వానాకాలంలో ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో 326 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 275 సన్నరకాలకు, 51 దొడ్డు రకాలకు ఉంటాయి.నవంబర్ నుంచి ప్రారంభమయ్యే ఈ కొనుగోళ్లు జనవరి వరకు కొనసాగుతాయి. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించేందుకు వీలుగా పీఏసీఎస్, డీసీఎంఎస్, ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.