HYD: భారీ వర్షాల నేపథ్యంలో హాట్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టి ఈఆర్టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. రానున్న రెండు రోజుల్లో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగర ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ మ్యాన్ హోల్ మూతలు తెరవకూడదన్నారు.