KMM: పాలేరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 20కోట్ల నిధులు మంజూరయ్యాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి చొరవతో నిధులు మంజూరు కాగా, మట్టి రహదారులు ఇకపై సీసీ రోడ్లుగా మారనున్నాయి. నియోజకవర్గంలోని 614 రోడ్ల నిర్మాణానికి రూ.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి.