AP: అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు. సభ జరుగుతుండగా మాట్లాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడుకునేవారు బయటకు వెళ్లాలని తెలిపారు. సభకు అంతరాయం కలిగించవద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. సభను కంట్రోల్ చేయాల్సిన విప్‌లను.. కంట్రోల్ చేయడం ఇబ్బందిగా మారిందన్నారు.