AP: YCP MLAలు, MLCలతో మాజీ CM జగన్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదన్నారు. ఎవరూ గొంతు విప్పకూడదనేది వారి అభిప్రాయమని ఆరోపించారు. గతంలో చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా రాకుండా TDP వాళ్లను లాక్కోవాలని కొందరు సలహాలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ తాము అలా చేయలేదని చెప్పారు.