VSP: పాలకొండకు చెందిన దూసి వసంతరావు (45) అనే వ్యక్తికి సపర్యలు చేసి, చికిత్స అందించిన అనంతరం విశాఖ రెడ్ క్రాస్ సిబ్బంది అతన్ని క్షేమంగా బుధవారం సోదరికి అప్పగించారు. మానసిక సమస్యలతో ఇల్లు వదిలి వచ్చిన వసంతరావు, ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం అందుకున్న రెడ్ క్రాస్ సిబ్బంది స్పందించారు.