KMR: సదాశివనగర్ మండలం అడ్డూరెల్లారెడ్డి గ్రామ రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం పోషణ మాసం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పోషణ లోపం లేని సమాజం ఏర్పాటుకు కృషి చేద్దామని అంగన్వాడీ టీచర్లు ప్రతిజ్ఞ చేశారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మాసం కార్యక్రమాలు జరుగుతాయని సూపర్వైజర్ పద్మ తెలిపారు.