ఆసియా కప్‌ను బహిష్కరించాలన్న నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వెనక్కి తీసుకుంది. ఫలితంగా, యూఏఈతో జరగాల్సిన మ్యాచ్ యథావిధిగా కొనసాగనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్.. షేక్ హ్యాండ్ వివాదం కారణంగా గంట ఆలస్యంగా రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.