NLG: ప్రతి వ్యక్తి మూడు నెలలకోసారి రక్తదానం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. నల్గొండలోని BJP కార్యాలయంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పకీరు మోహన్ రెడ్డి, నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.