NZB: బోధన్ పట్టణంలోని పురపాలక, వీరేశ లింగం వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాలకు గురువారం మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందని పురపాలక కమిషనర్ జాదవ్ కృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మిషన్ భగీరథ 200 MM పైప్లైన్లో లీకేజీ మరమ్మతులు చేపడుతున్నందున నీటి సరఫరా ఉండదని ఆయన అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.