ఆసియా కప్లో UAEపై పాకిస్థాన్ టీమ్ 41 పరుగుల తేడాతో విజయం సాధించి సూపర్-4కు అర్హత దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. జమాన్(50), అఫ్రీది(29*) రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన UAE 105 పరుగులకే ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో అఫ్రీది, అబ్రార్, రౌఫ్లు తలో 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.