KDP: ఖాజీపేట మండలం చెమర్లపల్లెలో ఉల్లి సాగు చేస్తున్న రైతులతో గురువారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మాట్లాడారు. ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించేలా, రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ, రెవెన్యూ అధికారులు, రైతులు కలెక్టర్‌తో పాటు పాల్గొన్నారు. ప్రజలకు అధికారులు ఏప్పుడు అందుబాటులో ఉండాలని తెలిపారు.