AKP: పరవాడ మండలం జలారిపేటలో ఈనెల 17న భార్యను కత్తితో పొడిచి హత్య చేసిన ఘటనలో భర్త ఒలిశెట్టి కొండను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. నిందితుడు వెన్నెలపాలెంలో సంచరిస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి అరెస్టు చేసినట్లు తెలిపారు. అనకాపల్లి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.