WGL: సరిహద్దులో పహారా కాస్తున్న జవాను సెలవులపై ఇంటికి సంతోషంగా వద్దామనుకున్నాడు. ఇంతలో విషాదం చోటుచేసుకుంది. మృతి చెందిన భార్యను కడసారి చూసుకునేందుకు వచ్చేలా చేసింది. ములుగు జిల్లా దేవగిరి పట్నంకు చెందిన ఐటీబీపీ హవల్దార్ శ్రీను భార్య ప్రీతి అనారోగ్యంతో గురువారం మృతి చెందింది. దీంతో జవాన్ గ్రామనికి వచ్చి తన భార్య అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటన తీవ్రంగా స్థానికులను కలిచివేసింది.