KRNL: వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు తిక్కన్న ఈ నెల 24న జరిగే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఎన్నికల ముందు కౌలు రైతులకు నూతన కౌలు చట్టం హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేశాక కూడా హామీలు నెరవేర్చలేదని ఆయన అన్నారు.